‘రైతు మహోత్సవం’ వేడుకలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 21 నుండి 23 వరకు మూడు రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఈ వేడుకలు జరుగుతాయి. రైతు మహోత్సవం నేపథ్యంలో ముగ్గురు మంత్రులు, పీసీసీ చీఫ్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర రైతు మహోత్సవాన్ని మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రారంభిస్తారు.
రైతు మహోత్సవం కోసం వ్యవసాయ శాఖ 150 స్టాళ్లను ఏర్పాటు చేసింది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మూడు రోజులు వసతులు, సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచనున్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల శాస్త్రవేత్తలు, నిపుణులు సహా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు నూతన వ్యవసాయ పద్ధతులపై వర్క్ షాపు నిర్వహిస్తారు.