సమాజంలోనూ, చరిత్రలోనూ ఇప్పటివరకు ఎన్నో వింతల పెళ్లిళ్లు చూసి ఉంటాం. కానీ ఇప్పుడు తైవాన్లో జరగనున్న ఓ పెళ్లి అందరినీ ఆకర్షిస్తోంది. కారు ప్రమాదంలో చనిపోయిన తన ప్రియుడి ఆత్మను పెళ్లి చేసుకునేందుకు ‘యు’ అనే యువతి సిద్ధమైంది. ఈ నెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురిని కాపాడిన ‘యు’ దురదృష్టవశాత్తూ తన ప్రియుడిని రక్షించలేకపోయినందుకు తీవ్ర ఆవేదన చెందింది. దీంతో అతడి తల్లి ఒంటరి అవుతుందని భావించి ప్రియుడి ఆత్మతో పెళ్లికి సిద్ధమైంది. ఈ పెళ్లిలో మరణించిన మృతుడి ఫొటో, దుస్తులను ఇతర వస్తువులను ఉపయోగిస్తారు. ‘యు’ అనే యువతి కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ కథ విన్నాక నెటిజెన్లు చాల మంది ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వుతున్నారు.
