ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.హైదరాబాద్: హయత్‌నగర్ డిపో-1కి చెందిన ఇద్దరు బస్ కండక్టర్లపై మహిళా దుర్భాషలాడి దాడి చేసిన ఘటనను బుధవారం టీఎస్‌ఆర్టీసీ ఖండించింది.
నిబద్ధతతో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. టిఎస్‌ఆర్‌టిసి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించి దాడులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది ఎంతో ఓపికగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహాయం చేయాలని మరియు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది, సజ్జనార్ చెప్పారు.