రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. ఏపీ, తెలంగాణల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ సెలవుల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా క్రిస్మస్ సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆప్సనల్ సెలవులు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25, 26 తేదీలను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించారు. డిసెంబర్ 25 క్రిస్మస్ అయితే, డిసెంబర్ 26 బాక్సింగ్ డే 2024, కాబట్టి ఈ రెండు రోజులు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయి.
మరోవైపు ఏపీలో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. అలాగే డిసెంబర్ 24, 26 తేదీలను ఆప్సనల్ సెలవులుగా ప్రకటించారు. దీంతో ఈసారి క్రిస్మస్ పండుగకు పాఠశాలలు, కళాశాలలకు ఒక్కరోజే సెలవు. అయితే, క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలు, కళాశాలలకు ఆప్సనల్ సెలవులు కూడా ఇచ్చారు. మరోవైపు 2025కి సంబంధించిన సెలవుల జాబితాను కూడా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ షెడ్యూల్ ప్రకారం 2025లో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్సనల్ సెలవులు. మొత్తం 44 రోజులున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ, ఆప్సనల్ రెండింటితో సహా సెలవులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.