ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, సినీ నటులు మరియు రాజకీయ నాయకుల జాతకాలను వెల్లడిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా పాపులర్ అయ్యాడు. అయితే తాజాగా ఆయన చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం పై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తీవ్రంగా స్పందించాయి. వేణుస్వామి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్‌ కు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, వేణుస్వామిని ఈ నెల 22న స్వయంగా హాజరుకావాలని నోటీసు జారీ చేశారు. ఇది తొలిసారి కాకపోయినా, గతంలో కూడా వేణు స్వామి పలువురు టాలీవుడ్ స్టార్ల కెరీర్, వివాహాలు, రాజకీయ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఆయన వేసిన అంచనాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ అయిన తరువాత, చైతన్య-శోభిత వివాహ నిశ్చితార్థం పై వ్యాఖ్యలు చేయడం మరోసారి వివాదాస్పదం అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *