విశాఖపట్నం: విశాఖపట్నం గాజువాకలోని ఆకాశ్ – బైజూస్ ఎడ్యుకేషనల్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ అనేక కంప్యూటర్లు, ఫర్నిచర్ మరియు ఇతర స్టడీ మెటీరియల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.