కరోనా మహమ్మారి దేశ ప్రజలందరినీ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడు కోలుకుంటుండగా. మంకీపాక్స్ మహమ్మారి ప్రజలందరినీ కలవర పెడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. మిగతా దేశాలకు కూడా ఈ వైరస్ పాకుతోంది. మంకీపాక్స్ పై అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. భారత్ లోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ విజృంభిస్తుందని అలెర్ట్ గా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది.
భారత్ ప్రభుత్వం బంగ్లాదేశ్ , పాకిస్థాన్ సరిహద్దుల్లో విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మంకీ పాక్స్ లక్షణాల విషయానికి వస్తే జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. మంకీపాక్స్ వైరస్ ఒకరి నుంచి వేరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఇది ఫ్లూ వంటి లక్షణాలు, చీముతో కూడిన గాయాలకు కారణమవుతుందని వైద్యులు వెల్లడించారు. కరోనా మహమ్మారి మాదిరిగానే ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని వైద్యులు చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.