మ్యాడ్ సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఈసారి మరో ఫన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఆయ్(AAY). ప్రస్తుతం నార్నే నితిన్ గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA2 టు బ్యానర్ లో ఆయ్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆయ్ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈట్రైలర్ ఆద్యంతం ఫుల్ కామెడీగా సాగింది. గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌లో హృద‌యానికి హ‌త్తుకునేలా మ‌న‌సారా న‌వ్వుకునేలా రూపొందిన ఈ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రేక్ష‌కుల‌ను నచ్చే అంశాలన్నీ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆయ్ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. కాగా ఈ సినిమా ఆగస్ట్ 15 న రిలీజ్ కానుంది. అదే రోజున రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, విక్రమ్ తంగలాన్, రామ్ డబల్ ఇస్మార్ట్ సినిమాలు ఉన్నాయి. ఇన్ని భారీ సినిమాల మధ్య రానున్న ఆయ్ ఎలాంటి హిట్ కొడుతుందో అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *