అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా పాన్-ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. హిందీలో కూడా బన్నీకి భారీ క్రేజ్‌ను సృష్టించింది. దీంతో, పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం పవర్‌హౌస్‌గా మారింది.
కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ లో అల్లు అర్జున్ సినిమాను నిర్మిస్తోంది. అందుకు సంబంధించి కాసేపటి క్రితం వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఈ సినిమా థీమ్ చూస్తుంటే వేరే లెవల్ లో ఉంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారు.