Andhra King Thaluka: రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కథ, రామ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో మంచి స్పందన రావడంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో చూడలేని వారు, మళ్లీ చూడాలనుకునే ప్రేక్షకులు డిజిటల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమా విడుదల కానుంది. ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించగా, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ రోజున ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ డేట్..?