మంచు విష్ణు ప్రధాన పాత్రలో మోహన్ బాబు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది మరియు వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మంచు కుటుంబం నుంచి మరో వారసుడు తెరంగ్రేటం చేస్తున్నాడు.

ఈ సినిమాలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నేడు కృష్ణాష్టమిని పురస్కరించుకుని అవ్రామ్ లుక్‌ను విడుదల చేశారు. మంచు విష్ణు చిన్నప్పటి పాత్ర అయిన తిన్నడుగా అవ్రామ్ ఇందులో కనిపించనున్నాడు. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన మోహన్‌బాబు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *