News5am, Breaking News Telugu Latest (22-05-2025): డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమాపై పని జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో మల్టీ లాంగ్వేజెస్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం ‘పూరి కనెక్ట్’ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. జూన్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో నటించే ప్రధాన నటీనటుల పేర్లను వరుసగా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే టబు కీలక పాత్రలో నటించనుండగా, విజయ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఇక ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ సేతుపతి దీనిపై స్పందిస్తూ కొన్ని విషయాలు వెల్లడించారు. ‘‘పూరి జగన్నాథ్ గారి పనిని నేను ఎంతో గౌరవిస్తాను. ఆయన తీసిన ప్రతి సినిమాను చూశాను. స్క్రిప్ట్ వినడానికి రెండు మూడు రోజులు పడుతుందేమో అనుకున్నా, కానీ కొన్ని గంటల్లోనే ఆయన కథను వివరించారు. జూన్ నుంచి షూటింగ్ మొదలవుతుంది. ప్రేక్షకులకన్నా ముందుగా నేనే ఎక్కువ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఇక టైటిల్ విషయానికి వస్తే, ఇప్పటికీ సినిమాకు టైటిల్ ఖరారు చేయలేదు. ‘బెగ్గర్’ అనే పేరు మీరే ఫిక్స్ చేసారా?’’ అంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.
More News:
Breaking News Movies:
‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్..
హరిహర వీరమల్లు థర్డ్ సింగిల్ రిలీజ్..
More Breaking News Telugu: External Sources
‘బెగ్గర్’ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి