News5am, Breaking Telugu News (05-06-2025): టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. హీరోలు తమ కెరీర్‌లో హిట్ అయిన సినిమాలను మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించిన, 2007లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఢీ’ సినిమాను జూన్ 6న తిరిగి విడుదల చేస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో శ్రీహరి పవర్‌ఫుల్ రోల్, బ్రహ్మానందం హాస్యం, సునీల్ ట్రాక్ ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేశాయి.
ఈ సినిమా అత్యంత వినోదభరితంగా సాగుతుంది. శ్రీను వైట్లకు వెంకీ మూవీ తర్వాత మరో హాస్య హిట్‌గా నిలిచింది. ఇదే సమయంలో, విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘ఢీ’ చిత్రం రీ రిలీజ్‌లోనూ మంచి వసూళ్లు రాబడుతుందని ఆశిస్తున్నారు. ఇక విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న విడుదల కానుంది.
More Telugu News:
Breaking New Telugu News:
ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్..
‘కింగ్డమ్’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
More Breaking News: External Sources
మంచు విష్ణు ‘ఢీ’ రీ రిలీజ్.. బ్రహ్మీ, సునీల్ల ఫన్ బ్లాస్ట్కు సిద్ధమా!