Dacoit first Song: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘డెకాయిట్’. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు.
‘మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్..’ అంటూ ప్రారంభమైన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసి, చిన్మయి శ్రీపాదతో కలిసి పాడారు. భాస్కరభట్ల రవికుమార్ రాసిన లిరిక్స్ ప్రేమ, బాధల మేళవింపుగా హృదయాన్ని తాకుతున్నాయి. శేష్, మృణాల్ మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. ప్రేమలోని మాధుర్యం, తర్వాత జరిగే ద్రోహం వల్ల కలిగే బాధను పాటలో చూపించారు. ఈ సినిమా తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కి, ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
అడివి శేష్ డెకాయిట్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్…