Dear Aira Song Released

Dear Aira Song Released: నారా రోహిత్ హీరోగా నటిస్తున్న 20వ చిత్రం ‘సుందరకాండ’ ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ చిత్రంతో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి.

ఇటీవల మూడో పాట ‘డియర్ ఐరా’ విడుదల కాగా, లియోన్ జేమ్స్ సంగీతం అందించి, కీర్తన వైద్యనాథన్‌తో కలిసి పాడిన ఈ మెలోడీ మంచి స్పందన పొందింది. శ్రీహర్ష ఇమాని రాసిన ఈ పాటలో నారా రోహిత్, వృతి వాఘాని జంట ఆకట్టుకున్నారు. నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Internal Links:

చిరు – అనిల్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్..

‘కిష్కింధపురి’ టీజర్ రిలీజ్..

External Links:

సుందరకాండ నుంచి డియర్ ఐరా సాంగ్ రిలీజ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *