రణ్‌వీర్, దీపికా పదుకొణె దంపతులకు ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో పండంటి ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీపావళి పండుగను పురస్కరించుకుని తొలిసారి చిన్నారి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్న రణ్‌వీర్, దీపికా తమ ముద్దుల తనయ పేరును కూడా ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసినట్లు తెలిపారు.

‘దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే’ ఈమె అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అభిమానులతో పాటు ఆలియా భట్, మమితా బైజు, షాలినీ పాండే తదితర సినీ ప్రముఖులు స్పందించారు. క్యూట్ అంటూ లవ్ ఎమోజీలు జోడించారు. 2018లో రణ్‌వీర్, దీపిక వివాహ బంధంతో ఒకటయ్యారు. కల్కి 2898 ఏడీతో అలరించిన దీపిక..సింగమ్ అగైన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఇందులో రణ్‌వీర్ అతిథి పాత్రలో సందడి చేశారు. మరో వైపు ధురంధన్ మువీలో బిజీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *