యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే సైఫ్ అలీఖాన్, శ్రుతి మారథే, మురళీ శర్మ వంటి వారు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ దేవర చిత్రం సెప్టెంబర్ 27 న విడుదల అయింది. ప్రస్తుతం దేవర చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.304 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక మొదటి రోజే దేవర ఏకంగా రూ.172 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మూవీ కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపారు . మరో వారంలో రూ.500కోట్ల మార్క్‌ను చేరుకోవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా, ఈ సినిమాలో తారక్ జోడిగా తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.