Disha Patani: ఇటీవల బాలీవుడ్‌లో వరుసగా దాడులు, కాల్పుల ఘటనలు సంచలనం రేపుతున్నాయి. సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దుండగులు చొరబడిన వార్తల తర్వాత, తాజాగా దిశా పటానీ ఇంటిముందు కాల్పులు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 12, 2025 ఉదయం బరేల్లీలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంటిముందు 6-7 రౌండ్లు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడకపోయినా, ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు కారణం దిశా సోదరి ఖుష్బూ పటానీ జూలైలో ఇన్‌స్టాగ్రామ్‌లో హిందూ సాధువులపై చేసిన కామెంట్స్ అని సమాచారం.
కాల్పుల సమయంలో దిశా తల్లిదండ్రులు, సోదరి ఇంట్లో ఉండగా, దిశా మాత్రం ముంబైలో షూటింగ్‌లో ఉంది. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా గ్యాంగ్ సభ్యులు ఫేస్‌బుక్‌లో ఈ దాడి తామే చేశామని ప్రకటించి, “సనాతన ధర్మానికి అవమానం చేస్తే ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. దిశా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు FIR నమోదు చేసి, ఇంటి వద్ద భద్రత పెంచారు. దాడి చేసినవారు ముందుగా రికీ చేసి ఢిల్లీ-లక్నో హైవే ద్వారా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.
Internal Links:
External Links:
దిశా పటానీ ఇంటిపై దాడి.. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డ దుండగులు.. కారణం ఇదే