రామ్‌ పోతినేని హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. బ్లాక్ బస్టర్ హిట్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ.. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దాంతో నెల తిరక్కుండానే డబుల్‌ ఇస్మార్ట్‌ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, సాయాజి షిండే, గెటప్ శ్రీను తదిరులు కీలక పాత్ర పోషించారు. థియేటర్స్ లో మిస్ అయిన వారు. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూడొచ్చు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *