Emmy Awards 2025: అంతర్జాతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 77వ ఎమ్మీ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్‌లోని పికాక్ థియేటర్‌లో ఘనంగా జరిగింది. హాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఎమ్మీ అవార్డులు అమెరికన్ టెలివిజన్ పరిశ్రమలో అత్యుత్తమ ప్రదర్శనలకు ఇచ్చే ప్రత్యేక గౌరవం. ప్రతి సంవత్సరం అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ అవార్డులను అందిస్తుంది. ఈసారి నామినేషన్లలో ఎన్నో సిరీస్‌లు, సినిమాలు పోటీ పడ్డాయి. ఇందులో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘అడోలెసెన్స్’ సిరీస్ 5 అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఇందులో నటించిన ఓవెన్ కూపర్ చిన్న వయసులోనే ఎమ్మీ అవార్డు గెలుచుకొని కొత్త రికార్డు సృష్టించాడు.
ఈ వేడుకలో 2024-2025 సీజన్‌లో ప్రసారమైన కార్యక్రమాలకు అవార్డులు ఇవ్వబడ్డాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘అడోలెసెన్స్’ మరియు ‘ఆర్కేన్ లీగ్ ఆఫ్ లెజెండ్స్’ సిరీస్‌లు అవార్డులు గెలుచుకున్నాయి. ‘సెవరెన్స్’ డ్రామా సిరీస్‌లో అద్భుతమైన నటనకు ట్రామెల్ టిల్మాన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు పొందగా, ఆయన ఈ విభాగంలో తొలి నల్లజాతి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.
Internal Links:
External Links:
అట్టహాసంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక.. ఏకంగా 5 అవార్డులు సొంతం చేసుకున్న అడాల్ సెన్స్