Funky Oversees Review: టాలీవుడ్‌లో ప్రత్యేకమైన కామెడీ శైలితో గుర్తింపు పొందిన దర్శకుడు అనుదీప్ కేవీ తీసిన తాజా సినిమా ‘ఫంకీ’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఓవర్సీస్ ప్రీమియర్స్ తర్వాత సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అనుదీప్ స్టైల్‌లో వన్‌లైనర్ జోకులు కొంతవరకు నవ్విస్తాయి. కానీ కొన్ని చోట్ల కామెడీ ఎక్కువై చిరాకు తెప్పించేలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండూ ఒకే విధంగా సాగుతాయి. కుటుంబ విలువలపై చేసిన ట్రోలింగ్ బాగున్నా, హీరో-హీరోయిన్ రొమాంటిక్ ట్రాక్ మాత్రం ఆకట్టుకోలేదు.
సినిమాలో బలమైన కథ లేదు. ప్రాసలు, సిల్లీ జోకులతోనే కథను ముందుకు తీసుకెళ్లారు. దిల్ రాజు, నాగ వంశీ అతిథి పాత్రల్లో కనిపించగా, హరీష్ శంకర్, అనుదీప్, కళ్యాణ్ కృష్ణ గెస్ట్ రోల్స్ చేశారు. ఎడిటింగ్ బలహీనంగా ఉండటంతో సినిమా ఒక ఫ్లోలో నడవదు, యూట్యూబ్ కామెడీ క్లిప్స్‌లా అనిపిస్తుంది. డబ్బింగ్ కూడా సరిగా సెట్ కాలేదు. విష్వక్ సేన్ ఎనర్జీ ఉన్నా, ఈ తరహా కామెడీ అతనికి సరిపోలలేదు. మొత్తానికి ‘ఫంకీ’ సినిమా మిశ్రమ స్పందన పొందింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఫంకీ ఓవర్సీస్ రివ్యూ.. విశ్వక్ ఖాతాలో మరొక ప్లాప్?