Increasing Ticket Rates: తెలుగు నిర్మాతలు ఆడియెన్స్‌ను ఎంత గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. కోట్ల రూపాయల బడ్జెట్లు పెట్టి, “మాకు ఇంత ఖర్చైంది” అని చెబుతూ, ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచి సాధారణ సినిమా అభిమానులపై భారం మోపుతున్నారు. ప్రభుత్వం అండదండలు ఉండటంతో, ముందు వెనుక ఆలోచించకుండా టికెట్ ధరల పెంపు కోసం జీవోలు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారం మరోసారి తీవ్ర విమర్శలకు కారణమైంది.
ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న “వార్ 2” సినిమాను సితార నాగవంశీ రూ. 90 కోట్లకు కొనుగోలు చేశారు. రజనీకాంత్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న “కూలీ” సినిమాను రూ. 45 కోట్లకు కొన్నారు. కానీ ఈ సినిమాలకు పెట్టిన పెట్టుబడి పేరుతో టికెట్ ధరలు పెంచమని కోరుతున్నారు. ఉదాహరణకు, చెన్నైలో PVR లో “కూలీ” టికెట్ రూ. 183 ఉంటే, హైదరాబాద్ PVR లో అది రూ. 453 గా ఉంది. సొంత రాష్ట్రంలో తక్కువ ధర ఉంటే, మన దగ్గర మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. “వార్ 2” కి కూడా ఇలాగే ధరలు ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలకు ఇంత భారీ ధరలు పెట్టడం ప్రేక్షకులను దోచుకోవడమే అని విమర్శలు వస్తున్నాయి. ఎంత ధర పెంచినా అభిమానులు చూస్తారనే భావనతో కొనసాగితే, “బాయ్‌కాట్ థియేటర్స్” అనే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎంత తగ్గించినా ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టం.
Internal Links:
‘ది ప్యారడైజ్’.. నానిఫస్ట్ లుక్..
‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్..
External Links:
వార్ 2, కూలీ టికెట్స్ రేట్స్ పెంచి ప్రేక్షకులను దోచేస్తున్న నిర్మాతలు