టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2017లో, నేను డీషోలో జానీ మాస్టర్‌తో పరిచయమయ్యాను, తర్వాత 2019లో జానీ మాస్టర్స్ టీమ్‌లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరాను. ఓ షో కోసం జానీ మాస్టర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబై వెళ్లినప్పుడు ముంబైలోని ఓ హోటల్‌లో నాపై అత్యాచారం జరిగింది. ఈ సూచనను బయట ఎవరికీ చెప్పవద్దని తనను బెదిరించారని, అదే విధంగా షూటింగ్ సమయంలో తాను చెప్పింది వినకపోతే అసభ్యంగా ప్రవర్తించాడని, మతం మారాలని ఒత్తిడి చేసాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు యువతిని విచారించగా జానీ మాస్టర్ కోరికను యువతి అంగీకరించకపోవడంతో జానీ మాస్టర్ బాధితురాలి జుట్టు పట్టుకుని దాడి చేయడంతో పాటు ఆగస్టు 28న బాధితురాలికి విచిత్రమైన పార్శిల్ కూడా వచ్చింది, పేరు లేని పార్శిల్‌ను తెరిచి చూడగా దాని లోపల ‘ Congratulations for son be care full’ అని రాసి ఆమె ఇంటి తలుపుకు వేలాడతీసాడని’ పోలీసులు FIR లో పేర్కొన్నారు. జానీ ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేడని, సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తప్పించుకున్న సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన నార్సింగి పోలీసులు, విచారణకు రావాలని, త్వరలో తమ ఎదుట హాజరుకావాలని జానీ మాస్టర్‌కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీని తొలగించారు.