టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్, జానీ మాస్టర్ భార్య సుమలత బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నానని ప్రేమ పేరుతో నా భర్తను ట్రాప్ చేసి వేధించిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఐదేళ్లుగా నరకం అంటే ఏమిటో చూపించింది. ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్లింది. అమ్మ వద్దు.. నాన్న వద్దు..నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. పెళ్లి చేసుకోమని వేధించేది, నా భర్త జానీ మాస్టర్‌ను ఇంటికి రాకుండా అడ్డుకునేది, 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేదని జానీ మాస్టర్ భార్య తెలిపింది.
నా భర్తతో కాకుండా చాలా మంది పురుషులతో తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయని జానీ మాస్టర్ భార్య సుమలత ఆరోపించింది. అయితే ఇదంతా తెలుసుకున్న జానీ మాస్టర్ ఆ బాలికను దూరంగా ఉంచాడు. సెలబ్రిటీలు, ధనవంతులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని సుమలత తెలియజేశారు. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొంది. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్లదే బాధ్యత.. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుతున్నట్టు వెల్లడించారు సుమలత..