Kalki 2 Update: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. విజువల్స్, కథ, స్టార్ కాస్ట్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సహజంగానే సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ దీపికా పదుకొణే ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోరని ప్రొడక్షన్ టీమ్ ప్రకటించింది. వారు “మేము జాగ్రత్తగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నాం. దీపిక మొదటి భాగంలో అద్భుతంగా పనిచేశారు, కానీ క్రియేటివ్ భాగస్వామ్యం కొనసాగలేదు. ఈ సినిమా పూర్తి అంకితభావం, సమయాన్ని కోరుతుంది. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులకు శుభాకాంక్షలు” అని తెలిపారు. తాజాగా తల్లి అయిన దీపిక షూటింగ్ టైమింగ్‌లో మార్పులు కోరడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
దీంతో సీక్వెల్‌లో కొత్త హీరోయిన్ ఎవరు అనేది అభిమానుల్లో చర్చనీయాంశమైంది. త్వరలోనే యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పటివరకు, కల్కి 2898 AD సీక్వెల్ ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మరింత భారీ స్థాయిలో, విస్తృతమైన విజువల్స్‌తో నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారని సమాచారం. దీపికా తప్పుకోవడంతో అభిమానుల్లో కొత్త ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Internal Links:
శివకార్తికేయన్ ‘మదరాసి’ ఓటీటీ స్టీమింగ్..
మిరాయ్ మూడు రోజుల కలెక్షన్స్..
External Links:
కల్కీ సినిమా నుంచి దీపికా పదుకునే అవుట్..