Kantarachapter1 Trailer Date Fix: కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన సినిమా కాంతార. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం శాండిల్‌వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. రూ.14 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విజయంతో మేకర్స్ కాంతార చాప్టర్ వన్‌ను ప్రకటించారు. రిషబ్ శెట్టి ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి నిర్ణయించిన టైమ్‌కి సినిమా పూర్తి చేశాడు. కాంతార ప్రీక్వెల్ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
ఇక ప్రమోషన్స్‌లో వేగం పెంచిన కాంతార టీమ్, ఈ నెల 22న మధ్యాహ్నం 12:45 గంటలకు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతోంది. దీనిని అఫీషియల్‌గా పోస్టర్ ద్వారా ప్రకటించారు. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అవుతున్న కాంతారకు థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ ఉంది. తెలుగులో ఈ సినిమా గీత ఆర్ట్స్ ద్వారా, నైజాంలో మైత్రీ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో భారీ ఎత్తున రిలీజ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రీక్వెల్ ఎంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
“News5am is a digital news platform that delivers crisp, reliable, and timely updates on current affairs, sports, entertainment, business, and technology. It focuses on presenting news in short, easy-to-read formats for quick understanding“.
Internal Links:
కామెడీతో అలరించిన రోబో శంకర్ మృతి…
కల్కీ సినిమా నుంచి దీపికా పదుకునే అవుట్..
External Links:
కాంతార 2 ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం పెట్టేసారు.. రెడీగా ఉండండి