Kingdom Movie Song Release

KINGDOM Trailer Date: విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘కింగ్‍డమ్’ జూలై 31న విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లను మేకర్స్ వేగవంతం చేశారు. ట్రైలర్‌ను జూలై 25న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ గౌతమ్ సాలిడ్ ట్రైలర్ కట్‌ను రెడీ చేశారని, ఈ ఒక్క ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయని టాక్ నడుస్తోంది. అధికారికంగా ట్రైలర్ అనౌన్స్‌మెంట్ రేపు సాయంత్రం లోపు రావచ్చని సమాచారం.

‘కింగ్‍డమ్’ పవర్‌ఫుల్ స్పై యాక్షన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘అన్న అంటేనే’ పాట సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ పాటలో విజయ్ దేవరకొండ అన్నగా సత్యదేవ్‌తో కలిసి భావోద్వేగభరితంగా కనిపించాడు. అనిరుధ్ రవిచందర్ ఈ పాటకు సంగీతం అందించి స్వయంగా పాడాడు. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. అభిమానులు విజయ్ మళ్లీ ఈ సినిమా ద్వారా సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారని ఆశిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.

Internal Links:

జూనియర్ ఓవర్సీస్ రివ్యూ..

OG vs అఖండ 2.. అసలు ఏంటీ పోస్ట్ పోన్..

External Links:

‘కింగ్‍డమ్’ కౌంట్‌డౌన్ షురూ.. ట్రైలర్ రీలిజ్ డేట్ ఇదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *