Kingdom Movie Review: విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారా విడుదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటించగా, సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ‘సూరి’గా బాగా మెప్పించాడు. పాత్రల పరిచయం నుంచి కథా ప్రవాహం వరకు దర్శకుడు ఎలాంటి ల్యాగ్ లేకుండా చక్కగా నడిపించారు. జైలు సన్నివేశాల్లో విజయ్ నటన, శ్రీలంక అడవులు, జాఫ్నా జైలు నేపథ్యాలు బాగా డిజైన్ చేశారు. ఫస్టాఫ్ డీసెంట్‌గా సాగుతూ, సెకండాఫ్‌కి బలమైన సెటప్‌ను అందించింది.
సెకండాఫ్ శురువాతలో కథ మళ్లీ ఉత్సాహంగా సాగినప్పటికీ కొద్దిసేపటికి కథ ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. అయినా యాక్షన్ ఎపిసోడ్స్ పక్కాగా ఉన్నాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుంది, కొద్దిచోట్ల బోరుగా అనిపించినా, ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ పుంజుకుని సాలిడ్ క్లైమాక్స్‌తో ముగిసింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇదొక బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచింది. అనిరుథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా నిలిచింది, నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌గా ఉన్నాయి. గత కొంతకాలంగా విజయ్‌కు మంచి హిట్ లేకపోయినా, ‘కింగ్డమ్’ మాత్రం మంచి ఊరటనిచ్చే చిత్రంగా నిలుస్తుంది. ఇక ప్రేక్షకుల స్పందన ఎంతవరకు ఉంటుందో చూడాలి.
Internal Links:
తమిళంలో మరో హిట్ కొట్టేసిన నిత్యామీనన్..
కింగ్‌డమ్ కొత్త సాంగ్ గూస్బంప్స్..