kiran abbavaram family visit Tirumala: టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బాబుకి నామకరణం శ్రీవారి సన్నిధిలో చేయడం కోసం తాము తిరుమలకు వచ్చామని తెలిపారు. తన కుమారుడికి హను అబ్బవరం అని పేరు పెట్టినట్లు చెప్పారు. శ్రీవారి దర్శనం చాలా శుభంగా జరిగిందని, మొదటిసారి తన బిడ్డతో స్వామిని దర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దర్శనం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రస్తుతం తాను నటిస్తున్న ప్రాజెక్టుల విషయానికొస్తే, ‘కే ర్యాంప్’ మరియు ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాల షూటింగ్ జరుగుతోందని చెప్పారు. ఈ నెలలోనే మరో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆ కొత్త ప్రాజెక్టులపై పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని వెల్లడించారు.
Internal Links:
ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కి అస్వస్థత..
External Links:
తిరుమలలో కిరణ్ అబ్బవరం దంపతులు.. శ్రీవారి సన్నిధిలో కుమారుడికి నామకరణం.