News5am, Latest Breaking News (11-06-2025): టాలీవుడ్ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి ఇటీవల మృతి చెందారు. జూన్ 10 రాత్రి కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన కన్నుమూశారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. ఆయన కొన్ని రోజులుగా కుటుంబానికి దూరంగా ఉండడం, అలాగే దర్శకుడిగా చివరిగా చేసిన సినిమాలు పరాజయం పాలవడంతో మానసిక ఒత్తిడికి గురయ్యారని సమాచారం. ఇండస్ట్రీలో సన్నిహితులు దూరం కావడమూ ఆయన మీద ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో టాలీవుడ్ మరో మంచి దర్శకుడిని కోల్పోయింది.
రవికుమార్ చౌదరి తన దర్శక జీవితాన్ని గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ‘యజ్ఞం’ సినిమాతో ప్రారంభించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత బాలకృష్ణతో చేసిన ‘వీరభద్ర’ ఆశించినంత విజయం సాధించలేదు. అలాగే నితిన్‌తో చేసిన ‘ఆటాడిస్తా’ కూడా పరాజయమైంది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ కొంత ఊరట ఇచ్చినా, సాయి ధరమ్ తేజ్‌తో తీసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మాత్రం ఓ మాదిరిగానే నిలిచింది.
More Latest Breaking:
Latest Breaking News:
థగ్ లైఫ్, షాకింగ్ వీకెండ్ కలెక్షన్లు..
More Latest Breaking News: External Sources
దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి ఇక లేరు..