News5am, Latest Breaking News (03-06-2025): సినీ హీరో అక్కినేని నాగార్జున ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఉండవల్లిలో ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆయన, చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి సంబంధించిన ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు అందించి, పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
గత ఏడాది నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య శోభితాతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన చిన్న కుమారుడు అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో గత సంవత్సరం నవంబర్ 26న అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. వచ్చే నెల 6వ తేదీన అఖిల్-జైనబ్ వివాహం జరగనుంది. జైనబ్ హైదరాబాద్‌కి చెందినవారు. గత కొన్ని సంవత్సరాలుగా అఖిల్‌తో ప్రేమలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులను నాగార్జున ఆహ్వానించారు. ఈ పెళ్లి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగనున్నట్లు సమాచారం, తర్వాత రాజస్థాన్‌లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారని తెలుస్తోంది.
More Latest Breaking News Political:
Breaking News:
రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్..
నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు
More Latest News: External Sources
సీఎం చంద్రబాబుతో అక్కినేని నాగార్జున భేటీ.. విషయం ఏంటంటే?