ఇటీవల విడుదలైన యూత్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’ భారీ విజయాన్ని సాధించింది. ఉగాది కానుకగా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, కామెడీ, ప్రేమ, స్నేహం వంటి అంశాలతో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్ అయిన ‘మ్యాడ్ స్క్వేర్’ పై తెలుగు ప్రేక్షకులు మొదటి నుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఊహించినట్లుగానే, ముగ్గురు హీరోలు తమ ప్రతిభతో మంచి టాక్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా లడ్డు నటన, కామెడీ టైమింగ్ చాలా ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ సక్సెస్ మీట్‌కి రావడం కూడా ఈ మూవీకి కొంత హెల్ప్ అయింది. ఇక ఈ చిత్రం థియేటర్స్‌లో రన్‌ని దాదాపు కంప్లీట్ చేసుకోవచ్చింది. దీంతో తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సమాచారం ప్రకారం ఇందులో ఈ చిత్రం ఈ ఏప్రిల్ 25 నుంచి అలరించేందుకు వచ్చేస్తుంది అని తెలుస్తుంది. అయితే పాన్ ఇండియా భాషల్లో కాకుండా కేవలం తెలుగులోనే ఈ చిత్రం రానున్నట్టు టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.