Madrasi OTT Streaming: కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం మదరాసి. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. అమరన్ విజయానంతరం వచ్చినందుకు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే వరుస ఫ్లాప్‌ల తర్వాత మురుగదాస్ ఈ సినిమాతో హిట్ సాధించాలని ప్రయత్నించాడు. కానీ భారీ హైప్ ఉన్నప్పటికీ ఈ చిత్రం మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది.
ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కథ, కథనం ఆకట్టుకోకపోవడంతో మదరాసి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో కూడా అదే స్థితి నెలకొంది. తమిళనాడులో మాత్రం ఓకే రేంజ్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.91 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. దీంతో ఇది శివకార్తికేయన్ కెరీర్‌లో మరో ప్లాప్‌గా మారింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ రైట్స్ కొనుగోలు చేసిందీ, అక్టోబర్ 3న స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రానుంది.
Internal Links:
మిరాయ్ మూడు రోజుల కలెక్షన్స్..
అట్టహాసంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
External Links:
శివకార్తికేయన్ ‘మదరాసి’ ఓటీటీ స్టీమింగ్..