Mirai Movie Collection: మిరాయ్ సినిమాను ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. యువ హీరో తేజ సజ్జా ఇందులో నటించగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా భాషల్లో విడుదలై, బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. తేజ సూపర్ హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా ఆకట్టుకున్నారు. కలెక్షన్లలో కూడా సినిమా బలంగా నిలుస్తోంది.
విడుదల రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 27.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. వీకెండ్‌లో హౌస్‌ఫుల్ షోలు జరిగి, మూడు రోజుల్లో రూ. 81.2 కోట్లు గ్రాస్ సాధించింది. ఓవర్సీస్‌లోనూ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో $1.7 మిలియన్ వసూలు చేసి, 2 మిలియన్ దిశగా దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ దాటి, లాభాల బాటలో ఉంది. ఫైనల్ రన్‌లో నిర్మాతలు, బయ్యర్స్‌కి భారీ లాభాలు తెచ్చే అవకాశం ఉంది.
Internal Links:
External Links:
మిరాయ్ మూడు రోజుల కలెక్షన్స్.. సూపర్ సెన్షేషన్