Mirai Trailer Release Date: యంగ్ హీరో తేజ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. చాలా తక్కువ సమయంలోనే హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ‘హనుమాన్’ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ప్రస్తుతం తేజ సజ్జా నటిస్తున్న రెండవ పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’. ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఈ సినిమాలో మంచు మనోజ్ శక్తివంతమైన విలన్‌గా కనిపించబోతుండగా, తేజ సూపర్ పవర్స్ కలిగిన యోధుడి పాత్రలో మెస్మరైజ్ చేయనున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్‌లో తేజ యాక్షన్, విజువల్స్ అద్భుతంగా ఆకట్టుకోగా, మానవ జాతి భవిష్యత్తును రక్షించే తొమ్మిది గ్రంథాలను కాపాడే యోధుడిగా హైలైట్ అయ్యాడు. తేజ-మనోజ్ మధ్య యాక్షన్ సీన్స్ టీజర్‌లోనే హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించగా, సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడతో పాటు మరికొన్ని భాషల్లోనూ రిలీజ్ కానుందని తెలిపారు. ఇక పవర్ ఫుల్ ట్రైలర్ ఆగస్ట్ 28న విడుదల కానుందని కూడా కన్ఫర్మ్ చేశారు.

Internal Links:
బండ్ల గణేశ్ ఇంట్లో గెట్ టూ గెదర్..
సుందరకాండ నుంచి డియర్ ఐరా సాంగ్ రిలీజ్..
External Links:
మిరాయ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..