విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 ఎఫ్ 3 సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇక వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద ఆసక్తి ఉంది. ఆయా ఆసక్తిని మరింత పెంచే విధంగా సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్లో మిగతా సంక్రాంతి సినిమాల కంటే ముందు వరుసలో నిలిచింది. ఆడియో సూపర్ హిట్ కావడం, డిజిటల్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అలాంటి ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది. మౌత్ టాక్ బాగా రావడంతో భారీ కలెక్షన్లను సాధిస్తోంది. వారంలోనే రూ.200కోట్ల కలెక్షన్ల మార్క్ దాటి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు భారీగా వసూళ్లు సాధించింది.

ఈ వార్త విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 1 సాయంత్రం 6గంటల జీ తెలుగు, జీ5 ఓటీటీలో ఒకేసారి అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో జీ5 ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. థియేటర్‌లో ఈ సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్‌ రావిపూడి తొలగించారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మార్చి 1న స్ట్రీమింగ్‌ కానున్న వెర్షన్‌లో మిస్‌ అయిన సన్నివేశాలు ఉంచుతారో? లేదో? చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *