Prabhas Fauji To Release During Dussehra: రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ఫౌజీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, టి-సిరీస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు ఇప్పటికే భారీ స్పందన వచ్చింది. దసరా పండుగకు సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని మేకర్స్ సంకేతాలు ఇచ్చారు. షూటింగ్ పూర్తయ్యే వరకు నిరంతర షెడ్యూల్‌తో సినిమాను అత్యంత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. విజువల్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుంది.
ఎమోషన్, గ్రాండ్యూర్‌కు పేరుగాంచిన హను రాఘవపూడి, ప్రభాస్‌ను కొత్తగా పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించనున్నారు. హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్‌లు వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ, విషాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఫౌజీ’ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
దసరాకి ‘ఫౌజీ’ గ్రాండ్ రిలీజ్….