ప్రముఖ తెలుగు యంగ్ నటుడు రాజ్ తరుణ్ మరియు లావణ్య ప్రేమ వ్యవహారం రెండు తెలుగు రాష్టాలలో చర్చగా మారిన విషయం తెలిసిందే. కాగా మరోవైపు రాజ్ తరుణ్ తన సినిమాలను వేగా వంతంగా పూర్తి చేస్తున్నాడు. రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకత్వం వహిస్తుండగా, శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. భారీ బడ్జెట్‌తో రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్స్ శుక్రవారం (జూలై-19)న విడుదల చేశారు.
ఒక ఊరుకి వచ్చిన సమస్యను ముందుండి తీర్చే వ్యక్తిగా యంగ్ నటుడు రాజ్ తరుణ్ కన్పిస్తున్నాడు. అక్కడక్కడ మహేష్ బాబు నటించిన మహర్షి , శ్రీమంతుడు వంటి చిత్రాల టచ్ కన్పిస్తున్నటు తెలుస్తుంది. యంగ్ నటుడు రాజ్ తరుణ్ ఊరుకి వచ్చిన సమస్యను తీర్చడం లేదా? అసలు ఆ ఊరుకి ఏమైనా సహాయం చేశాడా లేదా ? అనేది తెరపైన చూసి తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రంలో హాసిని సుధీర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం, ముఖేశ్ ఖన్నా లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండటం వల్ల ఈ చిత్రానికి బలం అని చెప్పొచ్చు. ట్రైలర్ చూసాక రాజ్ తరుణ్ అభిమానులు ఈ సారి హీరో హిట్ కొట్టేలా ఉన్నాడు అని తెలుపుతున్నారు.