Raju Weds Rambai Team Offers: ఇటీవల చిన్న సినిమాగా విడుదలై మౌత్ టాక్‌తో భారీ విజయం సాధించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర బృందం, మహిళా ప్రేక్షకులకు ధన్యవాదంగా నేడు ఉచిత ప్రదర్శన అవకాశం కల్పించింది. గ్రామీణ నేపథ్యంలోని ఈ భావోద్వేగ ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కలెక్షన్లు భారీగా పెరిగాయి. తొలి రోజు రూ.1.40 కోట్లు, మూడు రోజుల్లో రూ.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
సినిమా విజయంలో మహిళల పాత్ర కీలకమని భావించిన నిర్మాతలు, ‘మా రాంభాయ్ కథ.. ప్రతి మహిళ కోసం’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు. ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో మహిళలు నేడు మాత్రమే ఉచితంగా సినిమా చూడవచ్చు. ఇందుకు సంబంధించిన థియేటర్ల జాబితాను కూడా సినిమా టీమ్ విడుదల చేసింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
‘రాజు వెడ్స్ రాంబాయి’ టీం బంపరాఫర్.. మహిళలకు నేడు షోలు ఉచితం