Singer Rajvir Jawanda: ప్రముఖ పంజాబీ గాయకుడు రాజ్‌వీర్ జవాండా (35) కన్నుమూశారు. 11 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బుధవారం మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా బడ్డి సమీపంలో ఆయన బైక్ నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురయ్యారు. తల, వెన్నెముకకు తీవ్రమైన గాయాలు కావడంతో మొహాలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి రాలేదు. ఈ వార్తతో అభిమానులు దుఃఖంలో మునిగిపోయారు.
సెప్టెంబర్ 27న జవాండా 1300 సీసీ బైక్‌పై శిమ్లా విహారయాత్రకు బయల్దేరి వెళ్తుండగా పశువులను ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. భార్య వెళ్లొద్దని చెప్పినా వినకుండా బయల్దేరినట్లు సమాచారం. రాజ్‌వీర్ జవాండా 1990లో లూథియానా జిల్లా జాగ్రావ్‌లోని పోనా గ్రామంలో జన్మించారు. ‘‘కాకా జీ,’’ ‘‘సుబేదార్ జోగిందర్ సింగ్,’’ ‘‘జింద్ జాన్’’ వంటి హిట్ పాటలతో పాపులర్ అయ్యారు. అంతేకాకుండా ‘‘సుబేదార్ జోగిందర్’’ (2018), ‘‘జింద్ జాన్’’ (2019), ‘‘మిండో తసీల్దార్నీ’’ (2019) వంటి పంజాబీ సినిమాల్లో కూడా నటించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జుబీన్ గార్గ్ కేసులో సంచలన విషయాలు…
మూసేసిన థియేటర్స్ కూడా కాంతార కోసం తెరిచారు..
External Links:
పంజాబ్ గాయకుడు రాజ్‌వీర్ జవాండా కన్నుమూత