ప్రస్తుతం ప్రజల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. కరోనా నుంచి సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముఖ్యంగా ఓటీటీలు వచ్చిన తర్వాత నిర్మాతలకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ప్రేక్షకులను ఆకట్టుకుని థియేటర్లకు తీసుకురావడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దర్శకులు కూడా సూపర్ సక్సెస్ సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారిలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న ఆయన, ఆ తర్వాత ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్‌లో మరింత గొప్ప విజయాన్ని సాధించారు. దీని వల్ల అతనికి బాలీవుడ్‌లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ తరం స్టార్ డైరెక్టర్లకు సందీప్ రెడ్డి వంగా మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలరు.
ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ అభిమానులు కూడా సందీప్ మీద గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ‘అనిమల్’ మూవీలో రణ్‌బీర్ హీరోయిజం చూసిన తర్వాత, స్పిరీట్‌లో ప్రభాస్ ని ఇంకేరెంజ్ లో చూపిస్తాడో అనే కుతుహలంతో ఉన్నారు. అయితే ఈ మూవీ గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్నాప్పటికి, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ట్యాలెంటెడ్ హీరో గోపీచంద్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య బంధం ఎలాంటిదో మనక తెలిసిందే. గతంలో ‘వర్షం’ మూవీలో ఈ కాంబో చూశాం. ఈ వార్తలో నిజం ఎంతుందో తెలిదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది.