మెగాస్టార్ చిరంజీవిపై నటి సుహాసిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1980వ దశకంలో చిరంజీవి, సుహాసిని పలు చిత్రాల్లో హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా వాళ్ల సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను సుహాసిని గుర్తు చేస్తూ చిరును ప్రశంసించారు.
ఒకసారి తాము షూటింగ్ కోసం కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్లామని, ఆ సమయంలో కొందరు తాగుబోతులు కారును వెంబడించి బీరు బాటిల్స్ వేశారని, తమ ముందు కారులో వెళుతున్న చిరంజీవి అది చూసి కారు దిగి వాళ్లను గన్ తో బెదిరించారని, దీంతో వాళ్లంతా పారిపోయారని సుహాసిని చెప్పింది. హీరోయిజం అంటే కెమెరా ముందే కాదు రియల్ లైఫ్ లో కూడా అలాగే వుండాలి అంటూ చిరుపై సుహాసిని ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన మీకు గుర్తుందా? అని చిరంజీవి సుహాసిని అడగ్గా, ‘గుర్తుంది. వాళ్లు మిమ్మల్ని వెంబడించడం అనూహ్య పరిణామం’ అని చిరు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోను చిరు అభిమానులు షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పటిది, పూర్తి వీడియోను షేర్ చేయండి అని మరి కొందరు కామెంట్స్ లో కోరుతున్నారు.