హీరో సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబోలో తెరకెక్కిస్తున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘కంగువ’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకి తీసుక రాబోతున్నారు. ఇప్పటికే విడుద‌ల‌యిన మూవీ గ్లింప్స్, సాంగ్స్, టీజర్ తో అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ విల‌న్‌గా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా కంగువ ట్రైలర్ ను మేక‌ర్స్‌ విడుదల చేశారు. ట్రైల‌ర్‌లో సూర్య‌, బాబీ డియోల్ ప‌వ‌ర్‌ఫుల్ గా క‌నిపించారు. దిశా ప‌టానీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *