కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో హీరో సూర్య తన 44వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సూర్య తలకు స్వల్ప గాయమైంది. ఈ ఘటనపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సినీ నిర్మాత పాండ్యన్ స్పందించారు. సూర్య తలకు స్వల్ప గాయమైందని తెలిపారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించామని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. త్వరలో ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు.

కాగా, ‘సూర్య 44’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా కథాంశంతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తుండగా, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌ రాజశేఖర్ కర్పూరసుందర పాండ్యన్, కార్తికేయ సంతానం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. జోజు జార్జ్, కరుణాకరన్, జయరామ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను శ్రేయాస్ కృష్ణ నిర్వహిస్తుండగా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *