Tamil Actor Abhinay Dies Suddenly: తమిళ నటుడు అభినయ్ (44) దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ సోమవారం ఉదయం 4 గంటలకు మరణించారు. ‘‘తుళ్లువాదో ఇల్లమై’’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఆయన చికిత్స కోసం సహనటులు ధనుష్, కేపీవై బాలా నుంచి సాయం కూడా పొందారు. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ కథ, తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అభినయ్ కీలక పాత్ర పోషించాడు. ఆరుగురు హైస్కూల్ విద్యార్థుల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది.
2014 వరకు అభినయ్ తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి, తర్వాత ఆరోగ్య సమస్యలతో సినిమాలకు దూరమయ్యాడు. మధ్యలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశాడు. ఈ ఏడాది ‘గేమ్ ఆఫ్ లోన్స్’ చిత్రంతో మళ్లీ వెండితెరపైకి వచ్చి ప్రమోషన్లలో పాల్గొన్నాడు. అయితే అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరణించాడు. ప్రజలు తుది వీడ్కోలు చెప్పేందుకు ఆయన భౌతికకాయాన్ని కోడంబార్కంలోని నివాసంలో ఉంచినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో