Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మొదట ఈ సినిమాను మార్చి 26న విడుదల చేస్తారని భావించారు.

అయితే మేకర్స్ ఇప్పుడు రిలీజ్ డేట్‌పై సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాను ఒక వారం ముందుగానే, అంటే మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. ఉగాది పండుగ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అనే పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా, త్వరలో ట్రైలర్ అప్‌డేట్ కూడా ఇవ్వబోతున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *