News5am, Telugu Latest Headlines (17-05-2025): బలూచిస్తాన్ ఇకపై స్వతంత్ర దేశమని ప్రకటించిన బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్, తమను పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలన్నారు. పాకిస్తాన్ గత ఎన్నో దశాబ్దాలుగా బలూచ్ ప్రజలపై అణచివేతలు, హింస, కిడ్నాప్‌లు, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిందని తెలిపారు. దీంతో ఇకపై పాకిస్తానుతో సంబంధం లేకుండా స్వతంత్ర దేశంగా తమను ప్రకటించుకుంటున్నట్టు వెల్లడించారు. బలూచిస్తాన్‌లో ఉన్న పాక్ బలగాలు, ప్రభుత్వ సిబ్బంది వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించారు. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్, బలూచిస్తాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరారు. ఐక్యరాజ్యసమితి ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’గా గుర్తించి, శాంతి దళాలను పంపాలని విజ్ఞప్తి చేశారు.
భారతదేశం బలూచిస్తాన్‌లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరిన మీర్ యార్, భారతీయులు, మీడియా, యూట్యూబర్లు తమను పాకిస్తానీలుగా కాకుండా బలూచ్లుగా పిలవాలన్నారు. పీవోకేపై భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన, 1971లో ఢాకాలో లొంగిపోయిన అవమానాన్ని మళ్లీ అనుభవించకుండా పీవోకేను ఖాళీ చేయాలని పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని తేవాలని సూచించారు.
More Latest News:
Telugu Latest Headlines:
ఎస్-400 ముందు గర్వంతో నిల్చుని ప్రధాని మోదీ సెల్యూట్ చేశారు..