Breaking Buzz News

News5am, Breaking News Updates(19-05-2025): పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పోలీసులు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) మరియు ఇతర ఉగ్రవాద సంస్థల నిద్రాణ దళాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రను అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసులు కలసి నిర్వహించిన ఆపరేషన్‌లో హైదరాబాద్‌, విజయనగరం ప్రాంతాల నుంచి ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌ వారాసిగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌, మరొకరు విజయనగరానికి చెందిన సిరాజ్‌-ఉర్‌-రెహ్మాన్‌.

వీరికి సౌదీ అరేబియాలోని ఐఎస్‌ హ్యాండర్లు నుంచి ఆదేశాలు వచ్చినట్టు నిఘా సంస్థలు గుర్తించాయి. పేలుళ్ల కోసం వీరు విజయనగరంలో అమ్మోనియం సల్ఫేట్‌, అల్యూమినియం పౌడర్‌ వంటి పదార్థాలను కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో బాంబులు తయారు చేశారని పోలీసులు చెప్పారు. ఆ బాంబులు పరీక్షించేందుకు కొన్ని ప్రదేశాలను కూడా ఎంపిక చేశారని సమాచారం. హైదరాబాద్‌లో వీరి లక్ష్యం ఏమిటి? ఎక్కడ పేలుళ్లకు యత్నించారు? వీరికి సహకరించిన వారు ఎవరెవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు వారిని విచారించనున్నారు.

More News:

Breaking News Updates:

కారు డోర్లు లాక్ అయి నలుగురు చిన్నారులు మృతి..

రూ. 6200 కోట్లకు పైగా బ్యాంక్ స్కామ్..

More Breaking News: External Sources

https://www.hindustantimes.com/india-news/terror-attack-averted-in-hyderabad-2-isis-linked-suspects-arrested-report-101747625068954.html?utm_source=whatsapp&utm_medium=whatsappChannel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *