News5am, Breaking Latest News (03-06-2025): పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు హత్య చేశాక, భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ మీద తీవ్ర ప్రతీకారం తీర్చుకుంది. పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను నాశనం చేసి, 100కు పైగా ఉగ్రవాదులను హతమార్చింది. అనంతరం పాక్ వైమానిక కవ్వింపులకు ప్రతిగా భారత్ 11 పాక్ వైమానిక స్థావరాలపై దాడులు నిర్వహించింది. అయితే ఈ దాడుల్లో భారత్ రాఫెల్ విమానాలను కోల్పోయిందని పాకిస్తాన్ ఆరోపించగా, ఆపరేషన్ ప్రారంభంలో కొంతమేరకు వైమానిక నష్టాలు జరిగాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాలపై పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, జూలైలో వర్షాకాల సమావేశాలు జరిగే నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యేక సమావేశాలకు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రతిపక్షాలకు తెలియజేశామని కేంద్రం చెబుతోంది. అయినా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరోసారి ప్రత్యేక సమావేశాల డిమాండ్ చేయగా, ఎమర్జెన్సీ అమలై 50 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. కానీ కేంద్రం అలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.
More Breaking Latest News:
Latest National News:
కెనడా జీ-20 సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లడం లేదు..
పాక్‌కు ప్రధాని మోడీ మాస్ వార్నింగ్..
More Breaking Latest News: External Sources
ఆప్ సిందూర్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ‘నో’ చెప్పిన కేంద్రం.!