Breaking Telugu News

News5am, Breaking Telugu News (02-06-2025): కెనడాలో జూన్ 15-17 తేదీలలో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం లేదని తెలుస్తోంది. జీ-7లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యుకె, జపాన్, యుఎస్, కెనడా దేశాలు ఉంటాయి. ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు కూడా ఆహ్వానించబడ్డాయి. దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియాలకు ఆహ్వానాలు వచ్చినట్లు ప్రకటించగా, భారత ప్రధాని పర్యటనపై మాత్రం స్పష్టత లేదు. అధికారికంగా ఆహ్వానం రాలేదో లేక భారత్ ఆసక్తి చూపలేదో అని సమాచారం. గత ఆరు సంవత్సరాల్లో ఇదే ప్రధాని మోడీ జీ-7 సమ్మిట్‌కి వెళ్లకపోవడం తొలిసారి కావచ్చు.

భారత్‌పై ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నదన్న ఆరోపణల నేపథ్యంలో, కెనడాపై భారత్ అసంతృప్తిగా ఉంది. 2022లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించడంతో, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో మోడీ కెనడా పర్యటనపై భద్రతా సమస్యలు ఉన్నాయని, సంబంధాలు మెరుగవ్వాల్సిన అవసరం ఉందని భారత వర్గాలు అభిప్రాయపడ్డాయి.

More News:

Breaking Telugu News Today

పాక్‎కు ప్రధాని మోడీ మాస్ వార్నింగ్..

ఆపరేషన్ సిందూర్ నష్టాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీడీఎస్ అనిల్ చౌహాన్..

More Breaking Updated News: External Sources

కెనడా “G-7 సమ్మిట్”కు ప్రధాని మోడీ వెళ్లడం లేదు.. రెండు దేశాల మధ్య సంబంధాలే కారణం.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *